తెలంగాణ ఇంటర్ హాల్ టిక్కెట్లు 2026: డౌన్‌లోడ్ లింక్, పరీక్ష తేదీలు, ముఖ్య సూచనలు

తెలంగాణలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న లక్షలాది విద్యార్థులకు ముఖ్య సమాచారం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల (2025-26 విద్యా సంవత్సరం) హాల్ టిక్కెట్లు ఫిబ్రవరి 18, 2026న అధికారికంగా విడుదలయ్యాయి.

హాల్ టిక్కెట్లను ఆన్‌లైన్, కళాశాల లాగిన్, మరియు వాట్సాప్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హాల్ టిక్కెట్ల లభ్యత

  • కళాశాల లాగిన్: కళాశాలలు తమ అధికారిక లాగిన్ ద్వారా హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందించవచ్చు.
  • అధికారిక వెబ్‌సైట్: విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • వాట్సాప్ డెలివరీ: రిజిస్టర్డ్ తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు హాల్ టిక్కెట్లు పంపబడుతున్నాయి.

హాల్ టికెట్ ప్రత్యేకతలు

  • ప్రధానోపాధ్యాయుడి సంతకం అవసరం లేదు
  • డిజిటల్ కాపీతో పరీక్షకు హాజరు కావచ్చు
  • ప్రతి హాల్ టిక్కెట్‌లో QR కోడ్ ఉంది

TS Inter Exams 2026 ముఖ్య వివరాలు

  • పరీక్షల ప్రారంభం: ఫిబ్రవరి 25, 2026
  • పరీక్షల ముగింపు: మార్చి 18, 2026
  • మొత్తం విద్యార్థులు: 9,96,529
  • పరీక్షా కేంద్రాలు: 1,495
  • సీసీటీవీ పర్యవేక్షణ కట్టుదిట్టం

పరీక్ష సమయం

  • ఉదయం 9:00 AM – మధ్యాహ్నం 12:00 PM
  • 8:45 AMకు ముందే కేంద్రానికి చేరాలి
  • 9:05 తర్వాత అనుమతి లేదు

Step-by-Step: TG Inter Hall Tickets 2026 డౌన్‌లోడ్ విధానం

  1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ⇒ https://tgbieht.cgg.gov.in./
  2. “Inter Hall Tickets 2026” లింక్‌పై క్లిక్ చేయండి
  3. ఫస్ట్ ఇయర్ / సెకండ్ ఇయర్ ఎంపిక చేయండి
  4. అవసరమైన వివరాలు నమోదు చేయండి
  5. Submit పై క్లిక్ చేయండి
  6. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి
  7. PDF సేవ్ చేయండి లేదా ప్రింట్ తీసుకోండి

హాల్ టికెట్‌లో తనిఖీ చేయాల్సిన వివరాలు

  • విద్యార్థి పేరు
  • ఫోటో
  • రోల్ నంబర్
  • పరీక్షా కేంద్రం
  • సబ్జెక్టులు & తేదీలు
  • QR కోడ్ స్పష్టత

విద్యార్థులకు సూచనలు

  • హాల్ టికెట్ ముందుగానే డౌన్‌లోడ్ చేయండి
  • పరీక్షా కేంద్రాన్ని ముందే చూసివచ్చండి
  • సరైన నిద్ర తీసుకోండి
  • సమయానికి కేంద్రానికి చేరుకోండి
  • ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దు

TG Inter Hall Tickets 2026 ఇప్పటికే విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పూర్తి సిద్ధంగా ఉండాలి మరియు సమయపాలన పాటించాలి.

Leave a Comment